
నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి... మాస్టారూ!
‘‘ఏంటీ.. త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? అయితే నా ఓటు మాత్రం తనకే’’... చెన్నయ్‌లో ఈ బ్యూటీ అభిమానులు మాట్లాడుకున్న మాటలివి. తమిళనాడుకి చెందిన ఓ రాజకీయ పార్టీలో త్రిష చేరనున్నారనే వార్త దాదాపు రెండు రోజుల క్రితం గుప్పుమంది.
ఆ వార్త చెన్నయ్ మీదుగా హైదరాబాద్ వరకూ వచ్చింది. ఉన్నట్లుండి త్రిష ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? ఇక సినిమాలకు ముగింపు పలికేయాలనుకుంటున్నారేమో? అంటూ ఒకటే ఊహాగానాలు.
సామాజిక మాధ్యమం ద్వారా ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడేలా చేశారు త్రిష. ‘‘నన్ను రాజకీయాల్లో ఇన్‌వాల్వ్ చేయకండి. నాకసలు పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టే ఉద్దేశమే లేదు. ఇప్పుడే కాదు... భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చేరను’’ అని స్పష్టం చేశారామె.