ఎటూ తేల్చుకోలేకపోతున్నా! | I am stepping into filmmaking: Resul Pookutty | Sakshi
Sakshi News home page

ఎటూ తేల్చుకోలేకపోతున్నా!

Published Sun, Apr 12 2015 12:27 AM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

ఎటూ తేల్చుకోలేకపోతున్నా! - Sakshi

ఎటూ తేల్చుకోలేకపోతున్నా!

‘జయహో...’. హాలీవుడ్ చిత్రం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లోని ఈ పాట దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్‌కి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికిగాను ఒకటికి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారాయన. అదే చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన రసూల్ పూకుట్టిని కూడా ఆస్కార్ వరించింది. ఈ చిత్రం తర్వాత హాలీవుడ్‌లో రహమాన్ ఎంత బిజీ అయ్యారో రసూల్ కూడా అంతే బిజీ అయ్యారు. హిందీలో ‘మార్గరిటా విత్ స్ట్రా’, ‘నానక్ షా ఫకీర్’, ‘జానిసర్’ అనే చిత్రాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు సౌండ్ ఇంజినీర్‌గా చేస్తున్నారాయన.

 ఇప్పుడు ఆయన దర్శక, నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ఈ విషయం గురించి రసూల్ స్పందిస్తూ - ‘‘సినిమా రూపొందించాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. అయితే అది కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే దర్శక, నిర్మాతగా రెండు బాధ్యతలు చేపట్టాలా? ఏదైనా ఒకటే చేయాలా? అని తేల్చుకోలేకపోతున్నాను. త్వరలో ఓ నిర్ణయానికి వచ్చేస్తాను’’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement