హాలీవుడ్ ఆదాయంలో దాదాపు 60 శాతం అమెరికా బయటి నుంచే వస్తుంది. అందుకే, భారత్, చైనా లాంటి భారీ అంతర్జాతీయ సినిమా మార్కెట్లు హాలీవుడ్ సినిమాల బిజినెస్‌లో చాలా కీలకం. వాటిని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ తేదీల వ్యూహరచన చేస్తుంటారు.
అమెరికా తర్వాత అతి పెద్ద హాలీవుడ్ సినిమా మార్కెట్లలో ఒకటి - చైనా. అందుకే, కథకున్న పాపులారిటీ రీత్యా, చైనీయుల నూతన సంవత్సర వేడుకల రీత్యా ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ ‘కుంగ్‌ఫూ పాండా 3’ చిత్రాన్ని అమెరికా కన్నా వారం ముందే రిలీజ్ చేసింది.
చైనాలో సినీ మార్కెట్ విలువ 480 కోట్ల డాలర్లు (దాదాపు 31 వేల కోట్ల రూపాయల పైమాటే). కాగా, ఇప్పటికీ మన దేశంలో సినిమా మార్కెట్ 150 కోట్ల డాలర్లే (దాదాపు 10 వేల కోట్ల రూపాయల లోపు). ఈ భారతీయ సినిమా మార్కెట్‌లో హాలీవుడ్ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్‌స ఇప్పుడు 8 - 9 శాతం అయ్యాయి.
చాలా వరకు హాలీవుడ్ సినిమాలు అమెరికాతో పాటు అదే తేదీన ఇండియాలోనూ వస్తున్నాయి. అయితే, నూటికి 5 నుంచి 10 సినిమాలు అమెరికా కన్నా ముందే ఇక్కడ రిలీజవుతున్నాయి.
ఒకవేళ హాలీవుడ్‌లో సినిమా రిలీజైన వారం, పదిరోజుల తర్వాత ఇండియాలో దాన్ని రిలీజ్ చేస్తే, ఆ లోగా పైరసీ వల్ల ఆ సినిమా ఇక్కడకు వచ్చేసే అవకాశాలు ఎక్కువ.
భారీ హిందీ సినిమా ఏదైనా రిలీజవుతుంటే ఆగి, తమ సినిమాను ఆలస్యంగా రిలీజ్ చేయడం కన్నా, ముందుగానే రిలీజ్ చేయడం మంచిదని హాలీవుడ్ స్టూడియోలు భావిస్తున్నాయి.
చైనా తర్వాత మనమే కావాలట!!
Published Thu, Apr 28 2016 11:14 PM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM
Advertisement
Advertisement