ఆమె వయసేంటి? నా వయసేంటి? | Is Nayantara the reason behind Simbu and Hansika | Sakshi
Sakshi News home page

ఆమె వయసేంటి? నా వయసేంటి?

Published Wed, May 21 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

ఆమె వయసేంటి? నా వయసేంటి?

ఆమె వయసేంటి? నా వయసేంటి?

ఆ మధ్య కొన్ని సందర్భాల్లో నయనతార భుజాలపై చేతులేసి నవ్వుతూ పోజులిచ్చిన హన్సిక ఇప్పుడు ఉన్నట్లుండి... అదే నయనతారపై త్రాచుపాములా అంతెత్తు లేస్తోందట. దానికి కారణం హన్సికకు రావాల్సిన రెండు మూడు అవకాశాలు నయన పరం కావడమే అని కోలీవుడ్ టాక్. తాను కాదన్న శింబుతో నయన సన్నిహితంగా తిరుగుతూ ఉండడం కూడా హన్సిక కోపానికి కారణం అని మరో వాదన. ఏది ఏమైనా నయనతార పేరెత్తితేనే కస్సుబుస్సుమంటోందట హన్సిక.
 
 ఇటీవల ఓ సందర్భంలో ‘నయనతార మీకు పోటీ అని భావిస్తున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నిస్తే... ఆగ్రహంతో ఊగిపోయిందట హన్సిక. ‘‘నయనతార నాకు పోటీ ఏంటి? ఆమె వయసేంటి, నా వయసేంటి? నాకంటే ఆమె చాలా పెద్దది. అందం, అభినయంలో మాత్రం నా కంటే ఎంతో వెనుకబడి ఉంది. అంతెందుకు మా ఇద్దరికీ ఒకే తరహా డ్రస్ ఇచ్చి చూడండి. ఎవరు అందంగా కనిపిస్తారో తెలుస్తుంది’’ అని దురుసుగా సమాధానమిచ్చిందట. మొన్నటి దాకా తెలుగులో మెరిసిన హన్సిక ప్రస్తుతం తమిళం పైనే ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement