'జననం' స్వరాలాపాన
'జననం' స్వరాలాపాన
Published Mon, Oct 7 2013 2:14 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
భువన్, ప్రియాంత్, శ్రావణసంధ్య, గీతాభగత్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘జననం’. ఎస్.ఎల్.మణిగంజి దర్శకత్వంలో నూతన నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతే స్వరాలను కూడా అందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఎన్.శంకర్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని సునీల్‌కుమార్‌రెడ్డికి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. రెండు కోణాలున్న ప్రేమకథాచిత్రమిదని, అమ్మ ప్రేమకు, ప్రియురాలి ప్రేమకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇందులో చూపించామని దర్శకుడు తెలిపారు.
మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు. చిత్ర యూనిట్‌సభ్యులందరూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వి.సాగర్, హీరోలు శ్రీ, మనోజ్‌నందం తదితరులు కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement