ఎన్టీఆర్
ఓ వైపు శరవేగంగా షూటింగ్.. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు.. ఓ సైడేమో డబ్బింగ్ పనులు.. మరోసైడ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు ‘అరవింద సమేత’ చిత్రబృందం. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 11న సినిమాని రిలీజ్ చేయడం కోసం టీమ్ అన్ని పనులనూ ఒకేటైమ్‌లో యమా స్పీడ్‌గా చేస్తున్నారు. కుటుంబంలో జరిగిన విషాదాన్ని కూడా దిగమింగుకొని సినిమా కంప్లీట్ చేయడం కోసం ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అరవింద సమేత’. పూజాహెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా, నాగబాబు, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన గుడి సెట్‌లో చిత్రబృందంపై ఫ్యామిలీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడతారట. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీయస్ వినోద్.
Comments
Please login to add a commentAdd a comment