ఇది కసితో చేసిన సినిమా! | Jr NTR Temper Movie Audio Released | Sakshi
Sakshi News home page

ఇది కసితో చేసిన సినిమా!

Published Fri, Jan 30 2015 7:07 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

ఇది కసితో చేసిన సినిమా! - Sakshi

ఇది కసితో చేసిన సినిమా!

‘‘ఈ మధ్య కల్యాణ్ రామ్ అన్నయ్య చేసిన ‘పటాస్’ సూపర్ హిట్ అయ్యింది. ‘టెంపర్’ విజయంపై కూడా పూర్తి నమ్మకం ఉంది. బాబాయ్ నటించిన ‘లయన్’ కూడా ఘనవిజయం సాధిస్తుంది. ఇది నందమూరి నామ సంవత్సరం’’ అని ఎన్టీఆర్ చెప్పారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ నిర్మించిన చిత్రం ‘టెంపర్’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్, నరేంద్ర చౌదరి ఆవిష్కరించి కల్యాణ్ రామ్‌కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు నేను అన్ని సినిమాలూ కష్టపడి చేశాను. ఈ చిత్రాన్ని కష్టపడి మాత్రమే కాదు.. కసితో చేశా.
 
  పూరీ భయ్యాతో గతంలో చేసిన చిత్రం నిరుత్సాహపరిచింది. కానీ, ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఒక షాట్ కోసం అయితే ఏకంగా ఎనిమిది గంటలు నీళ్లు తాగకుండా ఉండిపోయాడు. ఈ చిత్రానికి హీరో, విలన్, ఐటమ్.. అన్నీ ఎన్టీఆరే’’ అని తెలిపారు. నందమూరి అభిమానులు కాలరెగరేసుకునే చిత్రమిదనీ, ఫిబ్రవరి 13న ఉదయం 5 గంటలకు ఈ చిత్రాన్ని విడుదల చేస్తామనీ బండ్ల గణేశ్ చెప్పారు. ఈ వేడుకలో డి. సురేశ్‌బాబు, బీవీయస్‌యన్ ప్రసాద్, జెమిని కిరణ్, పొట్లూరి వరప్రసాద్. కాజల్ అగర్వాల్, చార్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement