బిజీ అవుతున్న చందమామ | Kajal agarwal busy with tollywood and kollywood films | Sakshi
Sakshi News home page

బిజీ అవుతున్న చందమామ

Published Sat, Feb 6 2016 10:01 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

బిజీ అవుతున్న చందమామ - Sakshi

బిజీ అవుతున్న చందమామ

సినీ రంగంలో ఎవరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పరిస్థితులు చాలా త్వరగా మారిపోతాయి. ఒకప్పుడు సౌత్లో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న కాజల్ గత ఏడాది ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. రెమ్యూనరేషన్ భారీగా పెంచేయటంతో పాటు, లుక్ కూడా ఆకట్టుకునేలా లేకపోవటంతో సౌత్ ఫిలిం మేకర్స్, ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు.

పరిస్థితి అర్థం చేసుకున్న చందమామ వెంటనే రూట్ మార్చేసింది. రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులకు పోకుండా సినిమాలు అంగీకరించడానికి రెడీ అని తేల్చేసింది. అంతేకాదు.. కాస్త సన్నబడి గ్లామరస్ లుక్స్తో ఆకట్టుకుంది. దీంతో మరోసారి కాజల్కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే టాలీవుడ్లో రెండు ప్రాజెక్టులలో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ. మహేష్ సరసన బ్రహ్మోత్సవంతో పాటు, పవన్తో సర్దార్ గబ్బర్సింగ్ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాలతో పాటు తమిళ్లో మరో నాలుగు సినిమాలకు కమిట్ అయ్యింది. ఓ బైలింగ్యువల్ సినిమాతో పాటు జీవా హీరోగా రూపొందుతున్న కవలై వేండామ్, విక్రమ్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో హీరోయిన్ చేస్తోంది. వీటితోపాటు విజయ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాజల్ హీరోయిన్గా నటించిన బాలీవుడ్ సినిమా దో లఫ్జోంకీ కహానీ రిలీజ్కు రెడీ గా ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ మరోసారి నెంబర్ వన్ ప్లేస్ని టార్గెట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement