
అందరికీ ఆమే కావాలట..!
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటి కీర్తి సురేష్, వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు కూడా రాని అవకాశాలు ఈ ముద్దుగుమ్మను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమాలో నటిస్తున్న కీర్తి తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓకె చెప్పింది. ఈ సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ల లిస్ట్లో చేరటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో తమిళ నాట క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ బ్యూటి. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భైరవ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కీర్తి సురేష్, ఆ తరువాత వరుసగా సూర్య, కార్తీల సినిమాల్లో నటించేందుకు అంగీకరించింది. ఇతర హీరోయిన్లు గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే కీర్తి సురేష్ మాత్రం ఎక్కడా హద్దులు దాటకుండానే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.