ఈత దుస్తులకు నో : కాజల్ అగర్వాల్ | Kajal Agarwal says 'No' to swimsuit | Sakshi
Sakshi News home page

ఈత దుస్తులకు నో : కాజల్ అగర్వాల్

Published Sat, Sep 28 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

ఈత దుస్తులకు నో : కాజల్ అగర్వాల్

ఈత దుస్తులకు నో : కాజల్ అగర్వాల్

ఈ తరం హీరోయిన్లలో ఈత దుస్తులు ధరిస్తే తప్పేంటి అనే వారు లేకపోలేదు. ఈ తరహా దుస్తులు ధరించి నటించడానికి వారు అధిక పారితోషికం డిమాండ్ చేస్తారనే టాక్ ఉంది. అలాంటి అవకాశమే నటి కాజల్ అగర్వాల్‌కు రాగా ఆమె నో చెప్పేసిందట.

ఈ తరం హీరోయిన్లలో ఈత దుస్తులు ధరిస్తే తప్పేంటి అనే వారు లేకపోలేదు. ఈ తరహా దుస్తులు ధరించి నటించడానికి వారు అధిక పారితోషికం డిమాండ్ చేస్తారనే టాక్ ఉంది. అలాంటి అవకాశమే నటి కాజల్ అగర్వాల్‌కు రాగా ఆమె నో చెప్పేసిందట. కాజల్‌కు అంతగా అవకాశాలు లేని మాట నిజమే. కోలీవుడ్‌లో తుపాకీ చిత్రం తర్వాత విజయ్‌తో జిల్లా చిత్రంలో నటిస్తోంది. 
 
ఆ మధ్య కమల్‌హాసన్ సరసన నటించే అవకాశం వచ్చినా నిరాకరించినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం తెలుగులో మగధీర పేమ్ రామ్‌చరణ్‌కు జంటగా మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ బ్యూటీని కోలీవుడ్ నిర్మాత ఒకరు ఈత దుస్తులు ధరించి నటిస్తే పారితోషికం ఎక్కువ ఇస్తానని ఆశ చూపారట. అందుకు కాజల్ అగర్వాల్ ససేమిరా అన్నారట. 
 
ఈత దుస్తులు ధరించడం తన బాడీకి నప్పదని, అలా నటించడం తనకు నచ్చదని కరాఖండిగా చెప్పేసిందట. గ్లామర్ పాత్రలు ధరించడంలోనే తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని, అలాంటిది డబ్బు కోసం ఈత దుస్తులు ధరించి నటించాల్సిన అవసరం తనకు లేదని అంటోంది ఈ బ్యూటీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement