ప్లీజ్... ఆ రెండూ తప్ప!
ప్లీజ్... మీ క్వశ్చన్స్‌లో ఓ రెండిటిని డిలీట్ చేయండి! ఆ రెండిటికీ తప్ప మీరేం అడిగినా ఆన్సర్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు బాలీవుడ్ భామ కాజోల్. ఆమెను మరీ అంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలను ఎవరూ అడగడం లేదు. జస్ట్... కథేంటి? అందులో మీరు చేస్తున్న విలన్ రోల్ ఎలా ఉంటుంది? అనడిగితే ఆన్సర్ చేయడానికి కాజోల్ అటూ ఇటూ దిక్కులు చూస్తున్నారు.
కథ, క్యారెక్టర్ గురించి అంత చెప్పకూడని సినిమా ఏదని ఆలోచిస్తున్నారా? ధనుష్ ‘వీఐపీ–2’. ఇందులో కాజోల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. లేడీ విలన్ అనేసరికి అందరిలో ఆసక్తి పెరిగింది. ఆమె క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసుకోవాలని! కానీ, కాజోల్ మాత్రం ఇలా కండీషన్స్ అప్లై అంటున్నారు. ‘వీఐపీ–2’ చిత్రదర్శకురాలు సౌందర్యా రజనీకాంతే ఈ కండిషన్స్ పెట్టారని చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే... ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.