వీఐపీ–2లో బిగ్‌బాస్‌ రైసా | Raisa Wilson in Dhanush's VAP-2 movie | Sakshi
Sakshi News home page

వీఐపీ–2లో బిగ్‌బాస్‌ రైసా

Published Wed, Jul 12 2017 2:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

వీఐపీ–2లో బిగ్‌బాస్‌ రైసా

వీఐపీ–2లో బిగ్‌బాస్‌ రైసా

తమిళసినిమా :  విజయ్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌ బాస్‌’ రియాలిటీ షోలో పాల్గొన్న ముద్దుగుమ్మ రైసా విల్సన్‌. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సౌందర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన వీఐపీ–2 చిత్రంలో ఒక ముఖ్య భూమికలో నటించింది. అయితే ఆ చిత్రంలో కాజోల్‌కు సహాయకురాలిగా నటించిన రైసా వీఐపీ–2 ట్రైలర్‌లో కూడా కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటిస్తున్నప్పడు రైసా ఎరవనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ‘బిగ్‌ బాస్‌’ షో ద్వారా రైసా అమిత ప్రాచుర్యం పొందింది. అంతేకాదండోయ్‌ తమిళ తంబిలను ఆకట్టుకునేలా రైసా అందాల ఆరబోత ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ‘బిగ్‌బాస్‌’ పుణ్యమా అంటూ అమ్మడికి మంచి అవకాశాలు వస్తున్నట్టు కోలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement