
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న చిత్రం ‘ఎన్టీఆర్’. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథను రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు)గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజుకో వార్త బయటకు వదులుతూ నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నారు చిత్రబృందం.
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన లుక్‌ను రిలీజ్ చేస్తూ... ‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా’ అంటూ ట్వీట్ చేశాడు.
30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 11, 2018
మళ్లీ ఇప్పుడు ..
బాబాయ్, వాళ్ల నాన్న గారిలా...
నేను, మా నాన్నగారిలా.#NTRBiopic @DirKrish pic.twitter.com/RCc90TlVVd