మళ్లీ కమల్, విశ్వనాథ్ కాంబినేషన్... | Kamal Haasan teams up with K Vishwanath after 11 years ... | Sakshi
Sakshi News home page

మళ్లీ కమల్, విశ్వనాథ్ కాంబినేషన్...

Published Sun, Mar 16 2014 12:11 AM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

మళ్లీ కమల్, విశ్వనాథ్ కాంబినేషన్... - Sakshi

మళ్లీ కమల్, విశ్వనాథ్ కాంబినేషన్...

 తెర వెనుక కె.విశ్వనాథ్, తెరపైన కమల్‌హాసన్.. ఇక చెప్పేదేముంది! తన్మయానందభరితం. అలా కాకుండా ఇద్దరూ కలిసి నటిస్తే! నయనానందభరితం. అసలు ఈ కాంబినేషన్‌ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తే కాదు. కమల్, విశ్వనాథ్ కలిసి నటించిన తొలి సినిమా ‘శుభసంకల్పం’. ఎస్పీ బాలు అభ్యర్థనను తోసిపుచ్చలేక తొలిసారి ఆ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు విశ్వనాథ్. ఆ తర్వాత పి.సి. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన‘ద్రోహి’ సినిమా కోసం విశ్వనాథ్, కమల్ కలిసి నటించారు. ‘ద్రోహి’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ రెండు దిగ్గజాలు తెరను పంచుకోబోతున్నాయి.
 
  రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా ‘ఉత్తమ విలన్’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ మామయ్యగా విశ్వనాథ్ నటిస్తున్నారు. కథలో ఇది కీలకమైన పాత్ర కావడంతో స్వయంగా కమల్‌హాసనే... ఈ పాత్ర నటించాలని విశ్వనాథ్‌ని కోరారట. దాంతో కాదనలేక ఆ పాత్ర చేయడానికి అంగీకారం తెలిపారు విశ్వనాథ్. కథానుగుణంగా ఇందులో 8వ శతాబ్దం నాటి సన్నివేశాలు కొన్ని ఉంటాయట. ఆ సన్నివేశాల్లో విశ్వనాథ్ కనిపిస్తారట. ఊర్వశి, పార్వతీ మీనన్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement