
కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ కలిశారు. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్‌ను కలిసిన కమల్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేతిని పట్టుకుని ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు కమల్. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గతంలో విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం స్వాతిముత్యంలో కమల్ నటించారు. రాధిక, సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య తారలుగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీ సైతం దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment