మూడు సంవత్సరాల క్రితం హిందీ చిత్రం ‘తను వెడ్స్ మను: రిటర్న్స్’లో హాకీ ప్లేయర్‌గా కనిపించారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఇప్పుడు తన తర్వాతి చిత్రం ‘పంగా’ కోసం ఆమె కబడ్డీ ప్లేయర్‌గా మారనున్నారు. ‘బరెలీ కీ బర్ఫీ’ ఫేమ్ అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణి స్థాయికి ఎలా చేరుకుంది? అనేదే చిత్ర కథాంశం.
ఈ సినిమాలోని పాత్ర కోసం కంగనా పది కిలోల బరువు పెరగనున్నారు. కానీ ఒకేసారి పది కిలోలు కాకుండా ముందు ఆరు కేజీలు పెరిగి, ఆ తర్వాత మరో నాలుగు కేజీలు పెరుగుతారట. అంటే... సిక్స్ ఫ్లస్ ఫోర్ ఈక్వల్ టు టెన్ అన్నమాట. ఇందుకోసం స్పెషల్ డైట్‌ని కూడా ఫాలో అవుతున్నారట ఆమె. ప్రస్తుతం న్యూయార్క్‌లో హాలీడేని ఎంజాయ్ చేస్తోన్న కంగనా అక్కడ్నుంచి రాగానే కబడ్డీ శిక్షణలో పాల్గొంటారు. కబడ్డీలో కంగనాకు ట్రైనింగ్ పూర్తయ్యాక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ భోపాల్‌లో స్టార్ట్ అవుతుందట. ఇదిలా ఉంటే కంగనా నటించిన ‘మణికర్ణిక’ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment