టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి, తనకి రెండు విషయాల్లో పోలిక ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఆమె నటించిన 'పంగా' సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆమె విరాట్ గురించి మాట్లాడుతూ.. నాకు, కోహ్లికి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని ఎంతో మంది చెప్తుంటారు. నిజమే మా మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి.
పంగా రివ్యూ: మహిళలు, అస్సలు మిస్సవకండి
'మేము ఇద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నాం. దీంతో ఎక్కువ అభిమానులను సంపాదించాం. అంతేకాకుండా కోహ్లికి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారు. నేను కూడా ఎంతో దూకుడుగా ఉంటాను. క్రీడాకారుడి జీవితం అంత సులువు కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆట కోసం వారు తీవ్రంగా సాధన చేస్తారు. ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమిస్తారని' కంగనా తెలిపారు. కాగా కంగనా రనౌత్ నటించిన తాజా హిందీ సినిమా 'పంగా' ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో కంగనా జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. (పైలెట్ కంగనా)
Comments
Please login to add a commentAdd a comment