
కాకర... ఇప్పుడిదే చక్కెర!
గర్భిణీగా ఉన్నప్పుడు ఏవేవో తినాలనిపిస్తుంది. ఇది మహిళలందరికీ అనుభవమే. స్టార్ అయినా నాన్‌స్టార్ అయినా ఎవరైనా ఈ విషయంలో ఒకటే. కడుపులో బిడ్డను మోసే ప్రతి తల్లికీ పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా.. ఏవో తినాలపిస్తుంది. ఇప్పుడు కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈవిడగారికి కాకరకాయ చాలా రుచిగా అనిపిస్తోందట.
ఆ విషయం గురించి కరీనా చెబుతూ - ‘‘కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి, కూర వండించేటప్పుడు కొంచెం చక్కెర వేయమని చెప్పు, అప్పుడు చేదు తగ్గుతుందని నా స్నేహితులు అంటున్నారు. కానీ, చక్కెర వేయకుండానే నేను తింటున్నాను. నాకిప్పుడు ఆ టేస్ట్ అద్భుతంగా అనిపిస్తోంది. మన ఇండియన్ స్వీట్స్‌ని కూడా ఇష్టంగా లాగించేస్తున్నా’’ అన్నారు.