మనసుల్ని తాకే ప్రేమ...
కార్తీక్, శ్రీతేజ, హుదాష ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. శివాజి.యు దర్శకుడు. బలమూరి రామ్మోహనరావు నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఇది ముక్కోణ ప్రేమకథ అని, ప్రతి హృదయాన్నీ టచ్ చేసేలా కథ, కథనాలు సాగుతాయని నిర్మాత చెప్పారు.
హైదరాబాద్‌లో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ జరుగుతుందని, నవంబర్ 14 నుంచి అరకు, వైజాగ్‌ల్లో జరిగే రెండో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని, డిసెంబర్‌లో పాటలను, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు.
చంద్రమోహన్, శివాజీరాజా, చిత్రం శ్రీను, కాశీవిశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: గుత్తి మల్లికార్జున్, సంగీతం: రవీంద్రప్రసాద్, కెమెరా: జస్వంత్, సహ నిర్మాత: అజయ్ పడాల.