మస్త్‌ బిజీ | Keerthi Suresh To Team Up With Director Karthik Subbaraju | Sakshi
Sakshi News home page

మస్త్‌ బిజీ

Published Sat, Sep 14 2019 2:50 AM | Last Updated on Sat, Sep 14 2019 2:58 AM

Keerthi Suresh To Team Up With Director Karthik Subbaraju - Sakshi

కీర్తీ సురేష్‌

‘మహానటి’ సినిమాతో కీర్తీ సురేష్‌ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ ఫామ్‌లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ మరింత బిజీ అవుతున్నారు కీర్తి. ఆల్రెడీ తెలుగులో రెండు (మిస్‌ ఇండియా, నగేష్‌ కుక్కునూరు దర్శకత్వంలో ఓ సినిమా),  మలయాళంలో ‘మరక్కార్‌: ది అరభికడలింటే సింహమ్‌’, హిందీలో ‘మైదాన్‌’ మూవీ సినిమాలను చేస్తున్న కీర్తీ తాజాగా ఓ తమిళ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఎమోషనల్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘పిజ్జా, పేట’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొడైకెనాల్‌లో ప్రారంభమైంది. రెండు, మూడు షెడ్యూల్స్‌లోనే ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement