హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్సయినట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్స్‌ను తట్టుకోవాలంటే తనకు ఓ రేడియేషన్ సూట్ అవసరమని అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తూ ఆ రోజు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంత్ నీల్. నిన్న (జూన్ 4) ప్రశాంత్ నీల్ బర్త్ డే. ‘‘సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
‘రేడియేషన్ సూట్’లో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం’’ అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు ట్వీట్ చేశారు. దాంతో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమా నిర్మించబోతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమాలో హీరోగా నటిస్తున్నారు ఎన్టీఆర్ (రామ్‌చరణ్ మరో హీరో). ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్– త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment