KGF Hero Yash Birthday 5000kgs Cake Makes World Record | వరల్డ్‌ రికార్డు సృష్టించిన హీరో బర్త్‌ డే కేకు - Sakshi
Sakshi News home page

వరల్డ్‌ రికార్డు సృష్టించిన హీరో బర్త్‌ డే కేకు!

Jan 9 2020 2:51 PM | Updated on Jan 9 2020 3:31 PM

KGF Hero Yash 5000 KG Birthday Cake Makes World Record - Sakshi

కన్నడ రాకింగ్‌ స్టార్‌, కేజీఎఫ్‌ హీరో యష్‌ జనవరి 8న 34వ పుట్టినరోజును జరుపుకొన్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యష్‌ అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం బెంగుళూరులో భారీగానే సన్నాహాలు చేశారు. తమ అభిమాన రాక్‌స్టార్‌ బర్త్‌ డే కోసం ఏకంగా 5వేల కేజీల భారీ కేకు, 216 అడుగుల కటౌట్‌తో నగరం నడిబొడ్డున ఓ పండుగలా సందడి చేశారు. మొత్తం 20వేల మంది అభిమానుల మధ్య ఈ భారీ కేకును యష్‌... యష్‌ రాకింగ్‌ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో 7వ తేది అర్థరాత్రి తన భార్య రాధికతో కలిసి  కట్‌ చేశారు. కాగా ఈ అతిపెద్ద కేకును యష్‌ అభిమాని వేణు గౌడ బెంగుళూరులోని నయందహళ్లి నందిలిక్స్‌ గ్రౌండ్స్‌లో తయారు చేయించాడు.

ఇక ఈ కేకు కోసం 1800 వందల కేజీ మైదా పిండి, 1150 కేజీ చక్కెర, 1750 కిలోల క్రీమ్‌, 22,500 గుడ్లు, 50కేజీల డ్రై ఫ్రూట్స్‌, మరో 50 కేజీ నెయ్యి పదార్థాలను ఉపయోగించారు. బేకరి వర్కర్స్‌, అభిమానులు దాదాపు 50 గంటలపాటు శ్రమించి దీనిని తయారు చేశారు. అదేవిధంగా అన్ని భాషల్లో సూపర్‌ హిట్టు అయిన.. కేజీఎఫ్‌ సిరీస్‌ ‘కేజీఎఫ్‌-2’లో రాకీభాయ్‌గా గొడ్డలి పట్టుకుని కోపంగా చూస్తున్న యష్‌ పోస్టర్‌ను 216 అడుగుల కటౌట్‌ రూపొందించారు. ఈ సందర్భంగా ఇండియా వరల్డ్‌ రికార్ట్స్‌  యష్‌ బర్త్‌ డే కేకును ‘వరల్డ్‌ బిగ్గెస్ట్‌ సెలబ్రిటీ బర్త్‌ డే కేకు’ గా ప్రకటించినట్లు అభిమానులు తెలిపారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా యష్‌ పుట్టిన రోజున ఆయన భార్య రాధిక, కూతురు అయిరా స్పెషల్‌ విషెస్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కూతురితో కలిసి కేకును తయారు చేసిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement