
‘నాకు మా అమ్మనాన్న పెట్టిన పేరు ఆలియా అద్వానీ. కానీ సల్మాన్ ఖాన్ నన్ను పేరు మార్చుకోమని సలహా ఇచ్చారు’ అంటున్నారు హీరోయిన్ కియరా అద్వాని. ఫుగ్లి చిత్రం ద్వారా 2014లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కియారా. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో కూడా మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు కియారా.
ఈ క్రమంలో కియారా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు మొదట అమ్మనాన్న పెట్టిన పేరు ఆలియా. కానీ అప్పటికే బాలీవుడ్‌లో ఇదే పేరుతో మరో హీరోయిన్ ఉన్నారు. అప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పేరు మార్చుకోమని సూచించారు. బాలీవుడ్‌లో ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండకూడదని సల్మాన్ చెప్పారన్నా’రు. ‘సల్మాన్ నన్ను కేవలం పేరు మార్చుకోమనే చెప్పారు. ఇక కియారా అనే పేరును నేను పెట్టుకున్నాను’ అని తెలిపారు కియారా.
ప్రస్తుతం కియారా ‘కబీర్ సింగ్’ సినిమాలో షాహిద్ కపూర్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇదే కాక అక్షయ్ కుమార్ సరసన గుడ్ న్యూస్ చిత్రలో కూడా కియారా నటిస్తున్నట్లు సమాచారం.