లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: అమెజాన్‌లో ఏడు సినిమాలు | Lockdown: Seven Movies Including Amitab Movie Release On Amazon | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: అమెజాన్‌లో ఏడు సినిమాలు

Published Fri, May 15 2020 2:39 PM | Last Updated on Fri, May 15 2020 4:32 PM

Lockdown: Seven Movies Including Amitab Movie Release On Amazon - Sakshi

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. కరోనా లాక్‌డౌన ప్రభావం సినీ ఇండస్ట్రీపై బారీగానే పడింది. షూటింగ్‌లకు ఎప్పుడు అనుమతిస్తారో తెలియదు.. థియేటర్లకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చానా జనాలు వస్తారో లేదో తెలియదు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న పలు చిత్రాలకు చెందిన దర్శకనిర్మాతలు సందిగ్దంలో పడ్డారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దృష్ట్యా దర్శకనిర్మాతలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కాగా మరిన్ని చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే అమితాబ్ నటించిన బాలీవుడ్ సినిమా 'గులాబో సితాబో'  జూన్ 12న అమెజాన్‌లో విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పడు అదేబాట లో మరో ఆరు సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమయ్యాయి. 

ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర పోస్టర్  ప్రేక్షకులను ఆకట్టుకుంది. అను మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెడ్ అబుందంటియా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకు రావాలని చేసినప్పటికి ఆ పరిస్థితి కనిపించడం లేదు దాంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇక కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రం ‘పెంగ్విన్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. నూతన దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించారు. ఇందులో గర్భవతి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు.తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో రిలీజ్‌ చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లో రిలీజ్‌ కాకుండానే డిజిటల్లోకి‌ వచ్చాయి. 

పొన్ మగల్ వంధల్ (తమిళం)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ -  మే 29, 2020
నటీనటులు  - జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్
డైరెక్టర్ - జె.జె. ఫ్రెడరిక్
ప్రొడక్షన్  - సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్

గులాబో సితాబో (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ -  జూన్ 12, 2020
నటీనటులు  - అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా
రచన - జూహి చతుర్వేది
డైరెక్టర్ - షూజిత్ సిర్కార్
ప్రొడక్షన్  - రోన్ని లాహిరి, శీల్ కుమార్

పెంగ్విన్ (తమిళం, తెలుగు),
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - జూన్ 19, 2020
నటీనటులు  - కీర్తి సురేశ్
డైరెక్టర్ - ఈశ్వర్ కార్తీక్
ప్రొడక్షన్  - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్

లా (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - జూన్ 26, 2020
నటీనటులు  - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు
డైరెక్టర్ - రఘు సమర్థ్
ప్రొడక్షన్  - అశ్విని, పునీత్ రాజ్ కుమార్

ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - జూలై 24, 2020
నటీనటులు - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్  
డైరెక్టర్ - పన్నాగ భరణ
ప్రొడక్షన్  - అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్

శకుంతలా దేవి (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - త్వరలో ప్రకటిస్తారు
నటీనటులు  - విద్యాబాలన్ర
డైరెక్టర్ - అనూ మీనన్
ప్రొడక్షన్  - అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.

సుఫియాం సుజాతాయం (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ - త్వరలో ప్రకటిస్తారు
నటీనటులు  - అదితి రావు హైదరీ, జయ సూర్య
డైరెక్టర్ - నరని పుజా షానవాస్
ప్రొడక్షన్  - విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్

చదవండి:
హిజ్రాలకు శేఖర్‌ కమ్ముల చేయూత
భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement