నా హృదయంలో నిదురించే చెలి | love, action, comedy in "na hrudayamlo nidurimche cheli" | Sakshi
Sakshi News home page

నా హృదయంలో నిదురించే చెలి

Published Wed, Oct 9 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

నా హృదయంలో నిదురించే చెలి

నా హృదయంలో నిదురించే చెలి

నితిన్ సత్య, దిశాపాండే జంటగా ఎస్.టి.వెందన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రం ‘నా హృదయంలో నిదురించే చెలి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎ.వి.రావు, పోతిరెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రానికి నిర్మాతలు. 
 
 ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘లవ్, యాక్షన్, కామెడీ, హారర్ సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. 
 
 అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి నవంబర్ మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. గంజా కర్ఫు, రేఖ, సురేష్, రేష్మా తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.వి.ఉదయ్‌శంకర్, సంగీతం: కణ్ణన్, సమర్పణ: ఏ.బేబీరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement