![Mahesh Babu and Sandeep Reddy Vanga film Shelved - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/2/Sandeep%20Reddy%20Vanga.jpg.webp?itok=UbQTv00h)
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమా లైన్‌లో ఉండగానే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో మరో సినిమా చేయాలని భావించాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాప్ లిస్ట్‌లో చేరిపోయిన సందీప్ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు.
ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్టుగా ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో మహేష్, సందీప్‌లు కలిసి కనిపించటంతో వీరి కాంబినేషన్‌లో సినిమా మొదలవ్వటం ఖాయంగా కనిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్, సందీప్‌తో సినిమాకు నో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. కారణాలు తెలియకపోయినా ప్రస్తుతానికి వీరి కాంబినేషన్‌కు బ్రేక్ పడినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment