
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషించిన ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించి మరో టీజర్ మంగళవారం విడుదలైంది. రాష్ట్ర సారధిగా హీరో విజన్ ఎలా ఉండబోతోందో ‘విజన్ ఆఫ్ భరత్’ అనే ఈ టీజర్ ద్వారా తెలిపారు. ‘ఒక్కసారి ప్రామిస్ చేసి మాట తప్పితే, నువ్వసలు మనిషివేకాదు’, ‘ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి’ లాంటి ఆకట్టుకునే డైలాగ్స్ ఎన్నోవున్నాయిందులో. ఏప్రిల్ 20న భరత్ సీఎంగా చార్జ్ తీసుకుంటారని చిత్ర బృందం తెలిపింది.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ‘భరత్ అనే నేను’ విడుదలై ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచిచూడాలిమరి.