
ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్లొచ్చేశారు మహేశ్‌బాబు! ఎప్పుడంటే? జస్ట్... ఓ ట్వంటీ డేస్ బ్యాక్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’లో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిన్మా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్‌లో మొన్నా మధ్య మహేశ్, పోసాని కృష్ణమురళి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల గెటప్పుల్లో ఉన్న పలువురు ఆర్టిస్టులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తీశారు.
త్వరలో మొదలు కానున్న మరో షెడ్యూల్‌లో మహేశ్‌పై ముఖ్య సన్నివేశాలు తీయనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సీయం చాంబర్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చిందని సమాచారం. అంటే... తాజా షెడ్యూల్‌లో ముఖ్యమంత్రిగా మహేశ్ చాంబర్‌లో పాల్గొనే సన్నివేశాలు తీస్తారన్న మాట. కియారా అద్వాణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.