Maharshi Movie Digital and Satellite Rights Sold For the Best Price in Mahesh Babu's Career - Sakshi
Sakshi News home page

డిజిటల్‌లో ‘మహర్షి’ రికార్డ్‌

Published Tue, Apr 2 2019 12:40 PM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Mahesh Babu Maharshi Digital Rights Sold For a Bomb - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ 25వ చిత్రం కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. భరత్‌ అనే నేను లాంటి బిగ్ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో మహర్షి భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ మహర్షి రికార్డులు సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమేజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 11 కోట్లు ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇది మహేష్ బాబు కెరీర్‌ బెస్ట్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement