స్పైడర్ ఆడియో ఫంక్షన్‌లో ఛేంజ్?
స్పైడర్ ఆడియో ఫంక్షన్‌లో ఛేంజ్?
Published Thu, Aug 31 2017 9:50 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది స్పైడర్. ఈ బైలింగువల్ చిత్రం కోసం తెలుగు, తమిళ్‌లో విడివిడిగా ఆడియో వేడుకలు నిర్వహించాలని ముందుగా చిత్ర నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 9న చెన్నైలో స్పైడర్ తమిళ ఆడియో వేడుకలను నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అదే రోజు తెలుగు ఆడియోను కూడా విడుదల చేయబోతున్నారంట. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఇద్దరు టాప్ డైరక్టర్లను చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానించి, వారి చేతుల మీదుగా గ్రాండ్ గా రెండు భాషల్లో ఒకేసారి వేడుకను నిర్వహించాలనుకుంటున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం సెప్టెంబర్ 16 లేదా 17వ తేదీల్లో ట్రెండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట.
ఆడియో, ప్రీ రిలీజ్ గ్యాప్‌లో ఓ భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించేందుకు మహేష్ సహా స్పైడర్ టీం రెడీ అవుతోంది. తద్వారా ప్రమోషన్ పార్ట్ ను కూడా కవర్ చేసేయొచ్చన్నది మేకర్లు ఆలోచనగా చెప్పుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్-రకుల్ జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్ సెప్టెంబర్ 27 ప్రపంచ వ్యాప‍్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీతోపాటు అరబిక్ లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేసే ఫ్లాన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement