
నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమధానమిచ్చారు. మీ జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం ఏమిటని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. చాలా ఉన్నాయి, కానీ నిర్వాణ పుట్టడం అందులో టాప్‌లో ఉంటుందని లక్ష్మి అన్నారు. ఉపాసన చాలా హెల్ప్‌ఫుల్ అని, అక్కినేని అఖిల్ స్వీట్ కానీ నాటీ అని, రామ్‌చరణ్ స్వీట్ హార్ట్ అని పేర్కొన్నారు.
అలాగే ఈ ఏడాది యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఓ నెటిజన్ ఫోన్ వాల్‌పేపర్ షేర్ చేయమని అడగటంతో.. ఆ స్ర్కీన్ షాట్‌ను షేర్ చేశారు. అలాగే 2019లో బెస్ట్ పార్ట్ ఏమిటని అడగగా.. అది గడిచిపోయిందని.. నా జీవితంలో అది చాలా చెత్త ఏడాదని ఆమె పేర్కొన్నారు. విష్ణు, మనోజ్‌లలో ఎవరని ఎంచుకుంటారని ప్రశ్నించగా.. ‘అది నేను ఎలా చెప్పగలను.. వారిద్దరు నా ఫేవరేట్’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment