
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా ‘బ్రాండ్ బాబు’ రాబోతోంది. డైరెక్టర్ మారుతి అందించిన ఈ కథను ప్రభాకర్ తెరకెక్కించారు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని మనస్తత్వం ఉన్న హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు.
బ్రాండ్ వస్తువులు వాడే వ్యక్తి ఓ పేదింటి అమ్మాయి అయిన ఈషా రెబ్బతో ప్రేమలో పడటం... తన ప్రేమను గెలిపించుకోవడంలో ఏం చేశాడు, హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి జేబీ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment