నేను మోడ్రన్ సీతను! | Modern Sita role in seethamma andalu ramayya sitralu Movie | Sakshi
Sakshi News home page

నేను మోడ్రన్ సీతను!

Published Tue, Jan 26 2016 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

నేను మోడ్రన్ సీతను!

నేను మోడ్రన్ సీతను!

జర్నలిజం చదువుతూ సెల్యులాయిడ్‌పైకి అడుగుపెట్టారు అర్తన.
రాజ్‌తరుణ్ సరసన ఆమె నటించిన ‘ సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు ’ ఈ శుక్రవారం విడుదల కానుంది.
ఈ చిత్రం గురించి అర్తన చెప్పిన ముచ్చట్లు...

     
* మాది కేరళ. సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ చూసిన ఓ కాస్టింగ్ ఏజెంట్ నన్ను కలిశారు. స్వతహాగా నాకూ సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఆడిషన్స్‌కి వచ్చా. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా.
     
* ఈ చిత్రంలో నా పాత్ర పేరు సీతా మహాలక్ష్మి. నా పాత్రను మోడ్రన్ సీతగా అభివర్ణించవచ్చు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ చిత్రంతో నటనకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది.
     
* సినిమా అంటే కేవలం గ్లామర్ రంగం అనే అభిప్రాయం ఉండేది. ఇక్కడికొచ్చాక సినిమా కోసం ఎంత కష్టపడాలో తెలిసింది. షూటింగ్ ప్రారంభంలో భాషాపరమైన ఇబ్బంది తలెత్తినా ఇప్పుడు తెలుగు అర్థం చేసుకుంటున్నా. త్వరలోనే తెలుగులో మాట్లాడతాను. నటన, డైలాగ్స్ విషయంలో రాజ్ తరుణ్ చక్కటి సహకారం అందించారు.
     
* గ్లామర్ పాత్రలంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి పాత్రలు నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉందామనుకుంటున్నా.
     
* తెలుగు చిత్రాలు చూస్తుంటాను. నాగార్జున, అల్లు అర్జున్‌లను బాగా అభిమానిస్తా. నేను హీరోయిన్‌గా నటించిన మలయాళ చిత్రం ‘ముతుగావు’ త్వరలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement