మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ముందుగా ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ రెహమాన్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆ స్థానం బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేథిని తీసుకున్నారు.
ప్రస్తుతం సైరా సినిమాకు పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని కూడా అమితే అందిస్తున్నారు. అయితే అమిత్ వర్క్ స్టైల్ నచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి చిత్రానికి కూడా ఆయన్నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నారట. సైరా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు చిరు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న వెల్లడించానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment