
మెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్లు దాటిన హీరోగా సత్తా చాటేందుకు కష్టపడుతున్నారు. రీ ఎంట్రీలో ఖైదీ నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న చిరు, ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
సైరా తరువాత చిరు చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఫైనల్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. అయితే ఈ సినిమాలో చిరు కొత్త లుక్‌లో కనిపించనున్నారట. స్లిమ్ లుక్‌లో కనిపించేందుకు ఇప్పటికే స్పెషల్ డైట్‌తో పాటు కసరత్తులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. సైరా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment