
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో జరిగాయి. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల.
మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా రూపొందుతుండటంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.
నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment