'చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు'
ఇటీవల ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల కాలంలో మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు తారా స్తాయికి చేరుకున్నాయని వెలువడుతున్న వార్తలకు నాగబాబు తెర దించేందుకు చేసిన ప్రయత్నమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో నాగబాబు... చిరంజీవిని పొగడ్డలతో ముంచెత్తారు.
సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా మెగా స్తార్ గా స్వయం కృష్టితో ఎదిగాడని, 24 ఏళ్ల వయస్సులో చిరంజీవి చెన్నై చేరుకుని ఎవరి అండ లేకుండా టాలీవుడ్ లో అత్యున్నత స్థాయికి చేరకున్నాడని నాగబాబు అబిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్నారన్నారు. అయితే చిరంజీవి సాధించిన హోదా, పేరు ప్రఖ్యాతలతోనే పవన్ కళ్యాణ్ కు అత్యధికంగా పాపులారిటి దక్కింది అని నాగబాబు అన్నారు. అంతేకాకుండా చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ, తనకు సినీ పరిశ్రమలో స్థానం లేదని అన్నారు.
చిరంజీవి మంచితనం వల్లే తమ కుటుంబం సినీ పరిశ్రమలో బలమైన శక్తిగా ఎదిగింది అని నాగబాబు తెలిపారు. చిరంజీవి లాంటి వ్యక్తి సోదరుడుగా ఉండటం తనకు గర్వమని,, తాను ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటానన్నాడు. సడెన్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల గురించి నాగబాబు ఎందుకు ప్రస్తావించవల్సిందనే అంశం చర్చకు దారి తీశాయి. ఇటీవల కాలంలో చిరంజీవి పాల్గొన్న కార్యక్రమాల్లో హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులు తగిన గౌరవం ఇవ్వకపోవడంతోనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమంటున్నారు. మెగా అభిమానులందరి దృష్టిలో చిరంజీవిని బిగ్ బాస్ గా నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నమని పలువురు అభిప్రాయపడ్డారు.