వినోదమే ప్రధానం | Nani Bujji Bangaram Audio released | Sakshi
Sakshi News home page

వినోదమే ప్రధానం

Published Mon, Jun 16 2014 11:10 PM | Last Updated on Fri, Jul 12 2019 4:42 PM

వినోదమే ప్రధానం - Sakshi

వినోదమే ప్రధానం

వినోద ప్రధానంగా సాగే ప్రేమకథతో కె. చంద్రకుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నాని బుజ్జి బంగారం’. ‘డాటరాఫ్ వర్మ’ చిత్రం ద్వారా సంగీతదర్శకునిగా పరిచయమైన అదేశ్ రవి ఈ చిత్రానికి దర్శకుడు. ఆయనే పాటలు కూడా స్వరపరిచారు. చందు, పూర్ణిమ, భానుశ్రీ, సాగర్, కాంచన, రోహిత్, లలిత ముఖ్య తారలు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి సీడీని ఆవిష్కరించారు. పాటలు బాగున్నాయని, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. మరో అతిథి, దర్శకుడు టి. ప్రభాకర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. నిర్మాతగా తనకిది తొలి చిత్రమని, కథ నచ్చడంతో నిర్మించానని చంద్రకుమార్‌రెడ్డి చెప్పారు. సినిమా బాగా వచ్చిందని, విజయం సాధించడం ఖాయమనే నమ్మకం ఉందని అదేశ్ రవి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement