నన్ను దోచుకొందువటే... | 'Nannu Dochukunduvate' Movie Launch | Sakshi
Sakshi News home page

నన్ను దోచుకొందువటే...

Aug 26 2013 1:18 AM | Updated on Sep 1 2017 10:07 PM

నన్ను దోచుకొందువటే...

నన్ను దోచుకొందువటే...

యువతరం కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘నన్ను దోచుకొందువటే’. కిరణ్, అక్షయ జంటగా.. రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది.

యువతరం కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘నన్ను దోచుకొందువటే’. కిరణ్, అక్షయ జంటగా.. రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి విజయానందరెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా క్లాప్ ఇచ్చారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
 వ్యాపారవేత్త ఎం.నరసింహరాజు పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సినారెగారి తొలిపాట పల్లవి మా సినిమా టైటిల్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. పాటలకు విదేశాలకు వెళతాం. దీపావళికి పాటలను, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని రాజ్‌కుమార్ చెప్పారు. 
 
 ఈ చిత్రంలో తామూ భాగమైనందకు కిరణ్, అక్షయ ఆనందం వ్యక్తం చేశారు. సుమన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, బాబూమోహన్, జీవా, షఫి, తెలంగాణ శకుంతల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ధరణికోట శివరాంప్రసాద్, సంగీతం: శ్రీవెంకట్, ఛాయాగ్రహణం: జగదీష్, కళ: జయకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement