అదొక మధుర అనుభవం
నటుడు ప్రశాంత్‌తో నటించడం మధురమైన అనుభవంగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నర్గిస్ ఫక్తి పేర్కొన్నారు. ఈమె బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ సరసన రాక్‌స్టార్ చిత్రం లోను, జాన్ అబ్రహాంకు జంటగా మెడ్రాస్ కేఫ్ చిత్రంలోను సాహిత్ కపూర్ సరసన పట్టా పోస్టర్, నిర్త హీరో చిత్రంలోను హీరోయిన్‌గా నటించారు. ఇటీవల విడుదలైన సల్మాన్‌ఖాన్ చిత్రం కిక్‌లో స్పెషల్ సాంగ్‌లో దుమ్ము రేపిన నర్గిస్ తాజాగా చార్మింగ్ హీరో ప్రశాంత్ నటిస్తున్న సాహసం చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో ఆయనతో ఆడటం విశేషం. సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ స్టార్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం సాహసం.
ఈ చిత్రం కోసం మదన్‌కార్గి రాసిన కారత్తిల్ కారత్తిల్ చిల్లి ఇవ అనే పాటను వారం రోజులుగా చెన్నైలో రాజు సుందరం నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. స్థానిక మీనంబాక్కంలోని బిన్ని మిల్స్‌లో వేసిన బ్రహ్మాండమైన సెట్‌లో 50 మంది రష్యా డాన్సర్లు, 100 మంది నృత్య కళాకారులతో ప్రశాంత్, నర్గిస్‌ల నర్తించిన ఈ గీతం సాహసం చిత్రంలో ప్రత్యేకంగా ఉంటుందని నిర్మాత త్యాగరాజన్ పేర్కొన్నారు.
అద్భుతమైన నటి: శుక్రవారం స్థానిక మీనంబాక్కంలోని బిన్ని మిల్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో ప్రశాం త్ మాట్లాడు తూ నటి నర్గిస్ అద్భుతమైన నటి అని, ఈ పాటలో తనతో సమవుజ్జీగా నటించారన్నారు. నర్గిస్ తొలి సారిగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు వచ్చారని, తనతో నటించిన పలువురు హీరోయిన్లలో ఈమె విశేషమైన నటి అని వ్యాఖ్యానించారు.
అదృష్టం : నటి నర్గిస్ మాట్లాడుతూ నటుడు ప్రశాంత్‌తో నటించడం అదృష్టంగా పేర్కొన్నారు. నటనలో అనుభవం గల ఆయనతో నటించడమంటే అదొక తీయని అనుభవం అన్నారు. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక ఈ సాహసం చిత్రంతో తీరిందన్నారు. దక్షిణాదిలోను సింగిల్ సాంగ్‌కు ఆడిన తొలి చిత్రం చివరి చిత్రం కూడా ఇదేనని చెప్పారు. అయితే మంచి అవకాశం వస్తే హీరోయిన్‌గా నటిస్తానని నర్గిస్ పేర్కొన్నారు. భారీ విలువలతో రూపొందుతున్న సాహసం చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత త్యాగరాజన్ వెల్లడించారు.