'నరుడా డోనరుడా' ఫస్ట్ లుక్ | 'Naruda Donaruda' first look released | Sakshi
Sakshi News home page

'నరుడా డోనరుడా' ఫస్ట్ లుక్

Published Mon, Sep 19 2016 6:34 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

'Naruda Donaruda' first look released

సుమంత్ ఏం డొనేట్ చేయాలనుకుంటున్నాడో తెలిసి ఆశ్చర్యపోయానంటూ సరదాగా వ్యాఖ్యానించారు అక్కినేని నాగార్జున. హీరో సుమంత్ తాజా చిత్రం 'నరుడా డోనరుడా'  ఫస్ట్ లుక్ను సోమవారం సాయంత్రం ఆయన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.

గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న హీరో సుమంత్ ఓ కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్లో బాక్సాఫీస్ విజయంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకున్న 'విక్కీ డోనార్' సినిమాను 'నరుడా డోనరుడా' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వీర్య దానం చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం తెలిసిందే. సరికొత్త పాత్రలో సుమంత్ కనిపించనున్నాడు.

మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'నరుడా డోనరుడా' షూటింగ్ దాదాపు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్గా నటిస్తోంది. రొటీన్ కథలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సుమంత్ గ్యాప్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా విజయం సుమంత్ కెరీర్కు కీలకం కానుంది. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement