శింబుతో ఎడమొహం పెడమొహం | nayanatara love break up with shimbu | Sakshi
Sakshi News home page

శింబుతో ఎడమొహం పెడమొహం

Published Fri, May 2 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

శింబుతో  ఎడమొహం పెడమొహం

శింబుతో ఎడమొహం పెడమొహం

శింబు మంచి గుర్రుమీదున్నాడు. అవమాన భారంతో రగిలిపోతున్నాడు. అతన్ని అంతలా అవమానానికి గురిచేసింది ఎవరో కాదు. తన మాజీ ప్రియురాలు నయనతార. వారి రెండేళ్ల ప్రేమ పెటాకులవ్వడం, తత్ఫలితంగా ఎవరిదారి వారు చూసుకోవడం. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తుండటం అందరికీ తెలిసిందే. అయితే... ఇటీవల తన ఫ్రెండ్స్‌తో నయతార మాట్లాడిన తీరు...  శింబు అవమాన భారానికి కారణమైంది. వివరాల్లోకెళ్తే- ‘మళ్లీ శింబుతో కలిసి నటిస్తున్నావ్. జాగ్రత్తగా ఉండు. గత స్మృతుల ఫలితంగా మళ్లీ ప్రేమలో పడినా పడతావ్’ అని సరదాగా ఓ హెచ్చరికను నయనతారకు పాస్ చేశారట ఆమె సన్నిహితులు. దానికి నయన... ‘అంత సీన్ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు శింబు అయినా ఒక్కటే... శివకార్తికేయన్ అయినా ఒక్కటే’ అని ఘాటుగా స్పందించిందని సమాచారం. అయితే... ఈ మాట అలా అలా శింబు చెవిన పడింది. ఇంకేముంది.

శింబు కోపం నషాళానికి అంటింది. శివకార్తికేయన్ కమెడియన్‌గా మొదలై, తర్వాత సహాయ నటునిగా నటించి, ఇప్పుడు తమిళనాట కామెడీ హీరోగా స్థిరపడ్డాడు. అతనితో తనని పోల్చడంతో శింబు కోపం కట్టలు తెగిందని కోలీవుడ్ టాక్. అప్పటిదాకా నయనతారతో సరదాగా ఉన్న శింబు, ఈ మాట చెవిన పడ్డ దగ్గర్నుంచీ... లొకేషన్లో అంటీ ముట్టనట్లు ఉంటున్నాడట. నయనతారకు కూడా ఈ విషయం తెలిసి, తానూ బెట్టుగా ఉండటం మొదలుపెట్టిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లొకేషన్లో వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటం అక్కడ చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement