
జయంరవితో నయన
క్రేజీ జంట జయంరవి, నయనతార ఫారిన్ ట్రిప్‌కు రెడీ అవుతున్నారు. ఈ రేర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం తనీ వొరువన్. జయం రవి ఆయన సోదరుడు, దర్శకుడు జయంరాజా కలయికలో తొలి చిత్రం జయ్‌తో సహా పలు చిత్రాలు ఘన విజయం సాధించాయి. అయితే తిల్లాలంగడి చిత్రం తరువాత వీరిద్దరూ ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ తనీ ఒరువన్ చిత్రంతో మరోసారి కలిశారు. చాలా సెలైంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. కొన్ని కీలక సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ విదేశాలకు పయనానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
అక్కడ జయంరవి, నయనతారపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో నయనతార పోలీసు అధికారిగా నటిస్తున్నారు. దీంతో కొన్ని సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల్లోఈ బ్యూటీ దుమ్మురేపారని సమాచారం. ఇందుకోసం నయనతార గుర్రపుస్వారీలో శిక్షణ పొందారట. నటుడు అరవిందస్వామి కడల్ చిత్రం తరువాత ఈ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. మరో నటుడు గణేశ్ వెంకట్రామన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.