నయన, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమకథ సినిమాగా..! | Nayanthara Vignesh Shivan Love Story Becoming A Movie | Sakshi
Sakshi News home page

నయన, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమకథ సినిమాగా..!

Published Sun, Jan 19 2020 7:53 AM | Last Updated on Sun, Jan 19 2020 8:32 AM

Nayanthara Vignesh Shivan Love Story Becoming A Movie - Sakshi

నానుమ్‌ సింగిల్‌ దాన్‌ చిత్రంలో ఓ దృశ్యం

సినీ పరిశ్రమలో సంచలనం అంటే నటి నయనతార, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమనే అని చెప్పవచ్చు. ఇప్పుడా ప్రేమకథ సినిమాగా రూపొందుతోంది. త్రీ ఈజ్‌ ఏ కంపెనీ పతాకంపై జయకుమార్, పున్నగైపూ గీత కలిసి నిర్మిస్తున్న చిత్రం నానుమ్‌ సింగిల్‌ దాన్‌. ఇందులో నటుడు దినేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీప్తీ తివేస్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో మొట్టై రాజేంద్రన్, మనోబాలా, సెల్వేంద్రన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దీనికి డేవిడ్‌ ఆనంద్‌ ఛాయాగ్రహణం, హిందేశ్‌ మంజునాథ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఏఆర్‌.రెహా్మన్‌ శిష్యుడన్నది గమనార్హం. కాగా ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను గోపి నిర్వహిస్తున్నారు.

చదవండి: విఘ్నేశ్‌తో నయన్‌ తెగతెంపులు?

చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ సింగిల్‌ అనే పదం చాలా క్యాచీగా ఉంటుందని అన్నారు. దాన్ని కలుపుతూ తాము రూపొందిస్తున్న చిత్రానికి నానుమ్‌ సింగిల్‌ దాన్‌ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు తెలిపారు. టైటిల్‌ మాదిరిగానే చిత్ర కంటెంట్‌పైనా ప్రత్యేక శ్రద్ధచూపినట్లు తెలిపారు. తమిళసినిమాలో నటి నయనతార ప్రేమ చాలా సంచలనం అన్నారు. ఆ ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసిన ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం నానుమ్‌ సింగిల్‌ దాన్‌ అని చెప్పారు. నయనతార, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమ ఇప్పటికీ ఆసక్తినేనన్నారు. ఈ చిత్రంలోని హీరో లక్ష్యం నయనతార వంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదేనన్నారు.

చదవండి: విఘ్నేష్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నయయతార

తమిళ సినిమాలో చర్చనీయాంశంగా మారిన విషయం అజిత్‌ హీరోగా నటించిన బిల్లా చిత్రంలో నయనతార వేయించుకున్న టాట్టూనేనన్నారు. ఆ టాట్టూను పొడిచిన యువకుడిగా హీరో నటిస్తున్నాడని, అతను తన మనసులో ముద్రవేసుకున్న ప్రేమను నిజం చేసుకోవడానికి పడే పాట్లే నానుమ్‌ సింగిల్‌ దాన్‌ చిత్ర కథ అని చెప్పారు. ఇందులో నటి నయనతార, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమ వ్యవహారం చోటు చేసుకుంటుందని చెప్పారు. పూర్తి ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా సాగే ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని, చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement