
కళాతపస్వి కే విశ్వనాథ్ ఆరోగ్యం సరిగాలేదని, అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆయన్ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళుతున్నారన్న వార్త ఆదివారం మీడియా సర్కిల్స్‌లో వినిపించింది. ఈ విషయం విశ్వనాథ్ వరకు వెళ్లటంతో ఆయన స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ఓ వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ వ్యక్తిగత పనిమీదే విశ్వనాథ్ గారిని కలిసినట్టుగా తెలుస్తోంది.
శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం, స్వాతి కిరణం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ 2010లో చివరిసారిగా శుభప్రదం సినిమాను తెరకెక్కించారు. తరువాత పలు చిత్రాల్లో నటుడిగా కనిపించినా ఇటీవల వయోభారం కారణంగా సినీరంగానికి దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment