
నిధీ అగర్వాల్
‘సరదాగా నన్ను ఏమైనా అడగండి’ అంటూ నెటిజన్లకు నిధీ అగర్వాల్ ఆఫర్ ఇచ్చింది. అంతే.. కొంటె ప్రశ్నలు, సీరియస్ క్వొశ్చన్స్‌తో ఆమె ట్వీటర్ ఫాలోయర్స్ నిధీ నుంచి సమాధానాలు రాబట్టారు. వాటిలో ‘నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను చీట్ (మోసం) చేసింది. వదిలేసింది?’ అని ఒక ఫాలోయర్ అడిగితే – ‘‘చీటర్ లేని జీవితం చాలా బాగుంటుంది మై ఫ్రెండ్’’ అని సమాధానం ఇచ్చింది నిధి. మోసం చేసినవాళ్ల గురించి బాధపడకూడదని చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పింది కదూ.
ఇంకో ప్రశ్నకు సమాధానంగా ‘‘చిన్నప్పుడు నేను రబ్బర్లు, జర్నీ టికెట్స్‌ని దాచుకునేదాన్ని. ఇప్పుడు ‘ఇయర్ రింగ్స్’ కలెక్ట్ చేస్తున్నా. చెవి పోగులంటే నాకంత పిచ్చి’’ అని చెప్పింది. ‘‘రాత్రిపూట నీళ్లలోకి వెళ్లడం నాకు భయం’’ అని తనకున్న ఫోబియాని బయటపెట్టింది నిధి. బయాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం అని, ఇడ్లీ, పెరుగన్నం ఇష్టంగా తింటానని తన అభిరుచులు చెప్పింది. ఇలా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఆనందంగా అనిపించిందని పేర్కొంది నిధీ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment