ప్రేమకథ మీద మనసుపడ్డాడు | Nikhil doing a commercial love story | Sakshi
Sakshi News home page

ప్రేమకథ మీద మనసుపడ్డాడు

Published Tue, Sep 8 2015 1:12 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

ప్రేమకథ మీద మనసుపడ్డాడు - Sakshi

ప్రేమకథ మీద మనసుపడ్డాడు

మినిమమ్ బడ్జెట్ సినిమాల యంగ్ హీరోలలో మంచి డిమాండ్ ఉన్న స్టార్ నిఖిల్.. మూడు వరుస హిట్స్ తో సత్తా చాటిన ఈ యువ హీరో ప్రస్తుతం మరో ఎక్స్ పరిమెంటల్ సినిమాలో నటిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాను కాదని ప్రయోగాత్మకంగా అడుగులు వేస్తున్న నిఖిల్, త్వరలో ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్కు రెడీ అవుతున్నాడు. రవితేజను ఇమిటేట్ చేస్తున్నాడన్న అపవాదు నుండి బయటపడి, స్వామి రా రా..తో సక్సెస్ సాధించిన నిఖిల్, ఆ తరువాత కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.

కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సమ్థింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలు కమర్షియల్గా కూడా సక్సెస్ సాధించటంతో నిఖిల్ మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగింది. అందుకే చాలా మంది దర్శకనిర్మాతలు నిఖిల్ హీరోగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. నిఖిల్ కూడా ఇక ప్రయోగాలను పక్కన పెట్టి రెగ్యులర్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

నిఖిల్ ప్రస్తుతం శంకరాభరణం పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. సందీప్ కిషన్ హీరోగా టైగర్ సినిమాను తెరకెక్కించిన వీఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ మాస్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. చాలా రోజులుగా డిఫరెంట్ మూవీస్తో బోర్ ఫీల్ అయిన నిఖిల్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. మరి కమర్షియల్ ఫార్ములా నిఖిల్ కు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement