చాలా బాగుంటుంది! | Nikhil Rocks in Surya vs Surya | Sakshi
Sakshi News home page

చాలా బాగుంటుంది!

Published Wed, Jan 7 2015 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

చాలా బాగుంటుంది!

చాలా బాగుంటుంది!

‘‘నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం చూసి, ఫోన్ చేసి అభినందించాను. ఈ చిత్రానికి కార్తికేయ చేసిన ఫొటోగ్రఫీ ఓ ప్లస్ పాయింట్. నిఖిల్ చేస్తున్న తాజా చిత్రం ‘సూర్య వెర్సస్ సూర్య’ ట్రైలర్స్ చూస్తుంటే మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అనిపిస్తోంది. కార్తికేయ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నిఖిల్, త్రిద జంటగా బేబి త్రిష సమర్పణలో రూపొందుతున్న ‘సూర్య వర్సెస్ సూర్య’  ప్రచార చిత్రాన్ని వినాయక్ ఆవిష్కరించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని నిఖిల్ చెప్పారు. ఇప్పటివరకు చేసిన షూటింగ్ అవుట్‌పుట్ బాగా వచ్చిందని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement