నాకన్నా చిన్నవాడైనా డేటింగ్ చేస్తా! | Not doing anything startlingly glamorous: Parineeti Chopra | Sakshi
Sakshi News home page

నాకన్నా చిన్నవాడైనా డేటింగ్ చేస్తా!

Published Thu, Sep 4 2014 11:34 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

నాకన్నా చిన్నవాడైనా డేటింగ్ చేస్తా! - Sakshi

నాకన్నా చిన్నవాడైనా డేటింగ్ చేస్తా!

పాతికేళ్ల వయసున్న పరిణీతి చోప్రా ఇరవయ్యేళ్ల వయసున్న యువకుడితో డేటింగ్ చేయడానికి రెడీ అంటున్నారు. తమకన్నా వయసులో పెద్దయిన అమ్మాయిలను అబ్బాయిలు డేటింగ్ చేయడం,

పాతికేళ్ల వయసున్న పరిణీతి చోప్రా ఇరవయ్యేళ్ల వయసున్న యువకుడితో డేటింగ్ చేయడానికి రెడీ అంటున్నారు. తమకన్నా వయసులో పెద్దయిన అమ్మాయిలను అబ్బాయిలు డేటింగ్ చేయడం, పెళ్లాడటం కొత్త కాదు. మరి.. వారి బాటలో పరిణీతి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?.. అదే ప్రశ్న ఈ బ్యూటీ ముందుంచితే -‘‘నేను ప్రేమలో పడాలంటే ఆ కుర్రాడు మానసికంగా చాలా దృఢమైనవాడిగా ఉండాలి. నాకు పిరికివాళ్లు నచ్చరు. అమాయకంగా ఉండేవార్ని అస్సలు ప్రేమించను. ఎంతో తెలివిగా, మానసికంగా చాలా పరిణతి ఉన్న అబ్బాయినే ప్రేమిస్తా.
 
 అలాంటి అబ్బాయికి ఇరవయ్యేళ్ల వయసే అయినా సరే.. నాకు ప్రాబ్లమ్ లేదు. అతనితో డేటింగ్ చేసేస్తా. ప్రేమ కోసం ఒకర్ని.. డేటింగ్ కోసం మరొకర్ని సెలక్ట్ చేసుకునే అమ్మాయిని కాదు నేను. ఎవర్ని ప్రేమిస్తానో వారితోనే డేటింగ్ చేస్తా. నా మిగతా జీవితం అతనితో గడిపితే బాగుంటుంది అనే నమ్మకం కుదిరితే పెళ్లి కూడా చేసుకుంటా’’ అని చెప్పారు. నేడు గురుపూజా మహోత్సవం. ఈ సందర్భంగా పరిణీతి తన స్కూల్ డేస్‌ని గుర్తు చేసుకుంటూ -‘‘టీచర్స్ డే అంటే అప్పట్లో నాకో మంచి సెలవులాంటిది. ఆ రోజు కోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టేవాళ్లం.
 
 మా స్కూల్లో నేను లీడర్‌లాంటిదాన్ని. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ నేనే ప్లాన్ చేసేదాన్ని. ఎవరెవరు పాల్గొనాలో నేనే ఎంపిక చేసేదాన్ని. నేను ప్లాన్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ మా టీచర్లందరికీ నచ్చేలా చూసుకునేదాన్ని. మొత్తం రెండు గంటల పాటు వేడుకలు చేసేవాళ్లం. ఆ రెండు గంటల్లో ఆటలూ, పాటలూ, రచనలు చేసేవాళ్లం. అలాగే, మా టీచర్స్ కోసం రుచికరమైన వంటకాలు తయారు చేయడానికి ట్రై చేసేవాళ్లం.
 
  మా టీచర్స్ కూడా మా కోసం కొన్ని వంటకాలు తయారు చేసేవాళ్లు. టీచర్స్ డే అంటే నాకు ముఖ్యంగా మా మ్యూజిక్ టీచర్ నిధీ నారంగ్ గురించి చెప్పాలనిపిస్తోంది. సంగీతంలో తనే నాకు గురువు. ఆమెకు ఫీజు కట్టడం మొదలుపెట్టిన తొలి విద్యార్థిని నేనే. ఈ రోజు ప్రత్యేకంగా నా స్కూల్ విశేషాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement