'మా సినిమాలో ఎవరినీ కించపరచలేదు'
చెన్నై: కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఉత్తమ విలన్' సినిమాలో ఏ మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవని దర్శకుడు రమేశ్ అరవింద్ తెలిపారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
'దర్శకుడిగా చెబుతున్నా. ఉత్తమ విలన్ సినిమాలో ఎవరి మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు, మాటలు లేవు. ఇది ఒక సూపర్ స్టార్ భావాలకు సంబంధించిన సినిమా. ఇందులో ఆయన ప్రయాణం, భావోద్వేగాల గురించి చూపించాం. పాటల్లోనూ ఏ మతానికి వ్యతిరేకంగా చూపించలేదు' అని రమేష్ అరవింద్ తెలిపారు.
తమకు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. సెన్సార్ బోర్డు తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని, సినిమా విడుదలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని అన్నారు. మే 1న విడుదలకానున్న ఉత్తమ విలన్ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది.